మనం రోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. వాటిలో చాలా వరకు పెళ్లి వీడియోలే ఉంటాయి. అవి కొన్ని ఫన్నీగా….మరికొన్ని వింతగానూ ఉంటాయి. అలాంటిదే తాజాగా ఓ పెళ్లి బరాత్‌కు చెందిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పెళ్లి వేడుక అంటే వధూవరులతో పాటు చుట్టాలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంలో మునిగిపోతారు. ఈ వివాహ వేడుకల్లో కొంతమంది డ్యాన్స్ టాలెంట్ కూడా తెరపైకి వస్తుంది. వింత వింత డ్యాన్సులతో అందరినీ అలరిస్తుంటారు.
ఇలాంటి సందర్భంలో జరిగే కొన్ని సంఘటనలు అందరినీ తెగ నవ్విస్తాయి. ఈ వీడియో కూడా అందరినీ నవ్వించడంతో పాటు తెగ ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ వీడియోలో పెళ్లి బరాత్ లో ఓ వ్యక్తి డాన్స్ వేయడాన్ని చూడొచ్చు.
ఊరేగింపులో ఒక వ్యక్తి గుర్రాలకు దగ్గరగా డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ కనిపించాడు. అతని వింత చిందులు చూసి ఓ గుర్రానికి మండిందో ఏమో.. అంతే ఎగిరి వెనక కాళ్లతో ఒక్క తన్ను తన్నింది. అంతే సీన్ కట్ చేస్తే సారూ ఎగురుకుంటూ వెళ్లి కిందపడ్డాడు.
ఈ వీడియో చూసిన తర్వాత అందరూ తెగ నవ్వుకుంటున్నారు. గుర్రాలను ఆటపట్టిస్తే ఊరుకుంటాయా..? ఇలానే సమాధానం చెబుతాయంటూ పేర్కొంటున్నారు.
Advertisements