కాజల్ అగర్వాల్ కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అందుకు కారణం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కాజల్ ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.
బేబీ బాయ్ కు కాజల్ జన్మనిచ్చిన విషయం ప్రముఖ ఫోటో గ్రాఫర్ బయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ట్రెండ్ అవుతోంది. అయితే.. ఈ విషయంపై కాజల్ గానీ.. ఆమె భర్త గౌతమ్ గానీ స్పందించలేదు. అలా అని ఈ వార్తను ఖండించనూ లేదు. దీంతో కాజల్, గౌతమ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్లు.
కరోనా టైంలో 2020 అక్టోబర్ 30న తన ఫ్రెండ్, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది కాజల్. ప్రెగ్నెంట్ అయ్యే వరకు సినిమాల్లో నటించింది. తల్లి కాబోతున్న విషయంతో పాటు బేబీ షవర్, బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం కాజల్ నటించిన ఆచార్య మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఏప్రిల్ లోనే ఆచార్య విడుదలవుతుండడం.. ఆమెకు బిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్ డబుల్ ఖుషీలో ఉన్నారు.