ఆకలి చూపు పాప... ఇక చిరునవ్వుతో - Tolivelugu

ఆకలి చూపు పాప… ఇక చిరునవ్వుతో

, ఆకలి చూపు పాప… ఇక చిరునవ్వుతో

ప్రతి రోజు ఓ పాప మద్నాహ్న బోజనం సమయానికి ఆ స్కూలు వద్దకు వస్తుంది. అక్కడ పిల్లలు తినగా మిగిలింది తనకు పెడుతారు అన్న ఓ చిన్ని ఆశతో ఆ పాపను అన్నం కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ఆకలి చూపు పేరుతో ఇటీవల వైరల్‌గా మారిన ఆ చిన్నారి ఫోటోను ఆరా తీస్తే… ఆపాప మెహిదిపట్నం సమీపంలో ఉంటుందని తెలిసింది.

దివ్య అనే ఈ పాప తల్లితండ్రులు పేదరికంతో ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కనీసం తినడానికి కూడా సరిగ్గా లేని ఆ కుటుంబంలో దివ్యకు ఓ అక్క కూడా ఉంది. కానీ ఆమెను ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించటంతో… దివ్య ఒంటరైపోయింది. పైగా స్థానిక పాఠశాలలో ఆమెను ఎవరూ చేర్చుకోలేదు, చేర్పించలేదు. దాంతో… ఆమె ప్రతిరోజు తాను నివాసం ఉండే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మద్నాహ్న బోజన సమయానికి ఆ స్కూల్‌ డోర్‌ దగ్గర వెయిట్ చేస్తూ, అన్నం కోసం వాళ్లు ఎప్పుడు తింటారా… నాకు ఎప్పుడు పెడుతారా అని వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే… అక్కడ పెట్టే బోజనంలో అన్నం, ఓ కూరతో పాటు అరటిపండు కూడా ఉంటుంది. అది దివ్యకు పరమాన్నంతో సమానం.

ఆకలి చూపు పేరుతో వైరల్‌గా మారిన ఫోటోను ట్రెస్‌ చేసిన ఎంవీ ఫౌండేషన్‌ అనే ఎన్జీవో సంస్థ దివ్యను అదే స్కూల్‌లో చేర్పించి, పుస్తకాలు ఇప్పించింది. దాంతో… దివ్య తల్లి అందరి విద్యార్థుల్లాగే రెడీ చేసి స్కూలుకు పంపిస్తుంటే… ముసి ముసి నవ్వులతో దివ్య స్కూలుకు వెళ్లి, తాను అన్నం కోసం ఎదురు చూసిన చోటే అందరితో కలిసి కడుపు నిండా బోజనం చేయటం అక్కడున్న వారితో పాటు దివ్య తల్లితండ్రులకు ఎంతో సంతోషానిచ్చింది.

 

Share on facebook
Share on twitter
Share on whatsapp