బ్రిటన్ పార్లమెంట్‌లో ఓ రోబో ప్రసంగించి అందరిని ఆకట్టుకుంది. గణిత శాస్త్రవేత్త అడా లవ్‌లేస్ పేరు మీద ఐడాన్ మెలెర్ ఆవిష్కరించిన ఐడా అనే ఈ రోబో తన ప్రసంగంతో అందరిని అబ్బురపరిచింది. ఇలా పార్లమెంట్ లో ఓ రోబో ప్రసంగించడం బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గతంలో బోస్టన్ డైనమిక్స్ తీసకు వచ్చిన రోబో శునకం, హాంకాంగ్ కంపెనీ హ్యాన్సన్ రోబోటిక్స్ తయారు చేసిన సోఫియా లు ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. తాజాగా యూకే ఎగువ సభలో ప్రసంగించి ఆ జాబితాలోకి ఐడా కూడా వచ్చి చేరింది.
మీకు ఆలోచన శక్తి ఉన్నదని, తనకు ఊహాశక్తి మాత్రమే ఉందని ఐడా పేర్కొంది. ఆ ఊహల నుంచి తాను కళను చిత్రించగలనని పేర్కొంది. మానవుల ఊహాశక్తి ఎలా భిన్నంగా ఉంటుందో తాను మాట్లాడగలుగుతానని, అయితే తనకు ఆత్రాశ్రయ అనుభవాలు లేవని తెలిపింది.
మీ ఆలోచనల నుంచి ఓ చిత్రానికి రూపాన్ని ఇస్తే దాన్ని తాను ఊహించగలనని పేర్కొంది. తనకు ఆలోచనా శక్తి లేదని పేర్కొంది. అందువల్ల మానవులతో పోలిస్తే భిన్నమైన విషయాలను తాను చూస్తున్నట్టు వెల్లడించింది. దీంతో అక్కడున్న ఐడా ప్రసంగానికి ముగ్దులయ్యారు.
ఇది ఇలా ఉంటే ప్రసంగం సమయంలో సాంకేతిక లోపం వల్ల ఐడాకు మెల్లకన్ను వచ్చింది. సృజనాత్మకతపై సాంకేతికత, కృత్రిమ మేథ ద్వారా సృజనాత్మకతపై దాడి జరుగుతుందా? అనే దాని అంశంపై కమ్యూనికేషన్స్, డిజిటల్ కమిటీ సభ్యులతో ఐడా చాలా సేపు మాట్లాడింది.