ఉయ్యాల ఊగడం అందరికీ సరదాగానే ఉంటుంది. అయితే పార్కుల్లో ఉండేవి చాలా చిన్నగా ఉంటాయి. అదే పల్లెటూళ్లలో అయితే చాలా పెద్ద ఉయ్యాలలు ఏర్పాటు చేస్తుంటారు. కొందరు చాలా ఎత్తుకు ఊగుతూ సంతోష పడుతుంటారు. కానీ.. ఒక్కోసారి ఉయ్యాల సరదా తీర్చేస్తుంటుంది. రష్యాలో ఇద్దరు యువతులు కొండ అంచున ఉయ్యాలలో కూర్చొని ఉండగా.. ఓ వ్యక్తి బలంగా ఊపాడు. రెండు, మూడుసార్లు మంచిగానే ఉంది. నాలుగోసారి అటూ ఇటూ కదిలడంతో పడిపోయారు.
ఇద్దరు యువతులు 6,300 అడుగుల లోయలోకి పడిపోయారని అందరూ అనుకున్నారు. కానీ.. కొండ అంచున డెక్కింగ్ ప్లాట్ ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. లేకపోతే అంతే సంగతులు. ఆ ఉయ్యాలకు తగిన భద్రతా ఏర్పాట్లు లేవని..ముందే హెచ్చరించినా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఇకపై పర్యాటకుల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.