రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, అత్యుత్సాహం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లా కిజావళ్లూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో రాంగ్ రూట్‌లో వస్తూ ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు.
కారును తప్పించే ప్రయత్నంలో స్టీరింగ్‌ను ఎడమవైపునకు లాగి చర్చి ముందున్న ఆర్చిని ఢీకొట్టాడు. కాగా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.చర్చి ఆర్చి కుప్పకూలింది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కింది వీడియోలోని దృశ్యాలను మీరూ చూడవచ్చు.
#WATCH | Kerala: A Kerala State Road Transport Corporation bus met with an accident after colliding with a car near Kizhavallor in Pathanamthitta district. Thereafter, the bus rammed into the wall of a church. Injured passengers were rushed to hospital. pic.twitter.com/SiFjOvDLsR
— ANI (@ANI) March 11, 2023