ఈ మధ్య ఏపీలో కుల రాజకీయం తారా స్థాయికి చేరుకుంది. గతంలో కేవలం ఓట్ల వరకు అది… తెరవెనుక మాత్రమే ఉండేది. కానీ ఏపీలో స్థానిక సంస్థల పుణ్యమా అని కుల రాజకీయం పీక్స్ కు వెళ్ళిపోయింది. ఎంతలా అంటే ఓ ఎన్నికల కమీషనర్ ను పట్టుకొని సీఎం స్వయంగా కమ్మ కులం వ్యక్తి అంటూ టార్గెట్ చేసి మాట్లాడారు. సీఎం అనగా తప్పులేంది మేము అంటే తప్పేంటి అని వైసిపి నేతలు జగన్ ను ఫాలో అయిపోయారు.
దేశ వ్యాప్తంగానే కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా కంగారులో ఉంది. అది వైరస్ కాబట్టి కుల, జాతి, ప్రాంత, దేశం అనే తేడా లేకుండా విజృంభిస్తోంది. అయితే… కరోనా వైరస్ ఓ కులానికి మాత్రం రాదట. మనం కమ్మ వారం… మనకు కరోనా రాదమ్మ అంటూ ఓ తల్లి తన కూతురికి హితబోధ చేస్తున్న హలో యాప్ వీడియో వైరల్ అవుతుంది.
దీనిపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి కుల గజ్జి సమాజానికి చాలా ప్రమాదం అని, కరోనా వైరస్ కన్నా ఈ కుల ప్రీతి వైరస్ చాలా డేంజర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Does anyone know these STUPID and DANGEROUS ladies to Telugu Society
Police should throw them into jail for 10years for posting nonsense videos on social media
Caste is nothing but a group of distant relatives
Leaders and people should not poke any caste for self gains
THINK pic.twitter.com/JEEuSKzczy
— Venkat Vadlamudi (@vvrao999) March 22, 2020