మాములుగా కనుచూపు మేరలో ఒక చిన్న పామును చూస్తేనే భయంతో వెంటనే పరుగులు తీస్తాం.. ఇంకా దగ్గరగా చూస్తే.. ఇక మీ గుండె దడదడ కొట్టుకుంటుంది.. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా సింపుల్ గా ఓ పెద్ద కొండచిలువను తన మెడకు చుట్టుకొని..భూజాలపై మోసాడు. అచ్చం బొమ్మలా దానిని అమాంతం ఎత్తుకొని..ఆ వ్యక్తి బాగా కేరింతలు కొట్టాడు. అయితే.. ఈ సమయంలో పాము కూడా ఆ వ్యక్తిపై దాడి చేయలేదు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన తర్వాత.. నెటిజన్లు అంతా కూడా షాక్ అవుతున్నారు. వామ్మో ప్రమాదకరంగా ఉన్న ఇంత పెద్ద కొండచిలువను తలపై పెట్టుకొని ఇలా ఆడుకోవడం ఏంటీ..? అదేం చెయ్యలేదా అంటూ నోరెళ్లబెబుతున్నారు.
ఈ కొండచిలువ ఎంత ప్రమాదకరంగా ఉందో వీడియోలో మీరు కూడా చూడవచ్చు. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో.. పార్క్ లో ఒక వ్యక్తి తన మెడకు చుట్టుకొని.. భూజాలపై పెద్ద కొండచిలువను మొస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఫైథాన్ ఎంత భయానకంగా ఉందో వీడియోలో మీరు చూడవచ్చు. కానీ ఈ వ్యక్తి అతనికి అస్సలు భయపడడు. ఇంకా అతను కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తాడు.
భారీ కొండచిలువను చూస్తే దాని బరువు ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చు. కనీసం ఒక క్వింటా కంటే.. ఎక్కువగా ఉంటుంది. అయినా.. ఈ వ్యక్తి మెడకు చుట్టుకొని తోటలో హాయిగా నడుస్తూ కనిపిస్తాడు. ఈ అద్భుతమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో royal_pythons_ అనే యూజర్ షేర్ చేశారు. ఇంకా క్యాప్షన్‌లో ‘ఫాస్ట్ ఫ్రెండ్’ అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు చాలా ఇక నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసేయండి.
Advertisements