నీటిలో ఉన్నంత సేపే మొసలి..! నేలమీదికి వస్తే అది ముసల్దైపోతుంది. అంటే ..దాని శక్తి తగ్గిపోతుందనేది ఇక్కడ చెప్పాల్సిన విషయం. కానీ ఓ మొసలి భూమ్మీద కూడా తన బలాన్ని పరీక్షించుకుంది. దాన్ని కట్టడి చేయడానికి సెట్ చేసిన ఫెన్సింగుని విరిచేసింది. మొసలి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళెవరూ దీన్ని నమ్మలేరు. కానీ ఇది ఫ్లోరిడాలో జరిగింది. కావాలంటే మీరు ఓలుక్కేయండి.
ఓ మొసలి ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ ఊచలను వంచేసి అందులో నుంచి దూరిపోవడాన్ని వీడియోలో గమనించొచ్చు. సాంకేతికంగా ఇది డైనోసార్ అంటూ ఓ యూజర్ ఈ వీడియోకి కామెంట్ పెట్టాడు. ఫెన్సింగ్ ను బెండ్ చేసే సమయంలో కొంత ఇబ్బంది ఎదురైనా మొసలి వెనక్కి తగ్గలేదు.
ప్రయత్నించి మరీ సక్సెస్ కావడాన్ని గమనించొచ్చు. ఇలాంటివి చాలా అరుదుగానే కనిపిస్తుంటాయి. ఓ నెటిజన్ ఈ వీడియోని షేర్ చేశారు. దీన్ని 20 లక్షల మంది చూశారు.
FLORIDA GATOR VS METAL FENCE 🐊😳
Check out this big guy bend the bars and plow right through it this week in Placida. He eventually got through according to the @WINKNews viewer who shot the video. Only in #Florida! @GatorsDaily pic.twitter.com/3GCWtWhUnO— Matt Devitt (@MattDevittWINK) March 2, 2023