ఇక కోతులు అనేవి సహజంగానే నానా రచ్చ చేస్తాయి. ఇక వాటికి తిక్కరేగిందంటే అంతే సంగతి. ఎదుటి వారు ఎంతటి వారైనా, ఎంతటి బలవంతులైనా సరే వారికి దెబ్బకు సినిమా కనిపించాల్సిందే.ఇక ఇలాంటి ఘటనలు మనం చాలా సార్లు చూశాం.ఇంకా చూస్తూనే ఉన్నాం. కోతుల అల్లరి ఆకట్టుకుంటుంది కాబట్టే.. వాటికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా అలాంటి ఓ కోతికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆ వీడియోలో కోతి చేస్తున్న పని చూస్తే.. ఇవాళ ఎవరికో మూడింది రా అయ్యా అనిపించక మానదు.
ఆ కోతి ఎవరిపైనో పగ తీర్చుకునే క్రమంలో ఇలాంటి చర్యకు ఒడిగట్టిందని అనిపిస్తుంది.ఇక కోతి నుంచి మనిషి పుట్టడానికి సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ, మనుషులను చూసి కోతులు చాలా విషయాలు నేర్చుకుంటాయనేది అక్షర సత్యం. అయితే, కొన్ని కోతులు మంచి విషయాలు నేర్చుకుంటే.. మరికొన్ని కోతులు చెడు అంశాలను గ్రహిస్తాయి. గతంలో ఓ కోతి మద్యానికి బానిసై రోజూ మద్యం దుకాణానికి వెళ్లి మద్యం సేవించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సంచలన వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. అది చూసి నెటిజన్లు వామ్మో అని హడలిపోతున్నారు.
ఇక వైరల్ అవుతున్న ఆ ఫన్నీ వీడియోలో ఏముంది? ఆ కోతిని చూసి అంతలా భయపడటానికి కారణం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఓ కోతి ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో గానీ ఓ మందమైన కత్తిని పట్టుకొచ్చింది. దానిని నీటితో శుభ్రపరిచింది. ఆ తరువాత ఆ కత్తికి సాన పెట్టడం మొదలు పెట్టింది. ఓ రాతిపై కత్తిని నూరుతూ.. నీటి సాయంతో సాన పెట్టింది. మధ్య మధ్యలో కత్తి పదునును చెక్ చేయడం కొసమెరుపు. ఇలా కాసేపు కత్తి పదునుగా మారేంత వరకు సాన పెట్టింది. అయితే, కోతి కత్తిని సాన పెట్టడాన్ని వీడియో తీసిన వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
Hain tayyar hum…..
हैं तैयार हम…😊@ParveenKaswan @susantananda3 pic.twitter.com/1i8TGWCkkQ
— Rupin Sharma IPS (@rupin1992) December 9, 2021
Advertisements