స్వదేశంలో ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు కోహ్లీ సిద్దమవుతున్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌కు కాస్త సమయం ఉండడంతో సతీమణి అనుష్క శర్మతో కలిసి విరాట్ రుషికేష్ టూర్‌కు వెళ్లాడు.
ఇందుకు సంబందించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తాజాగా రుషికేష్‌లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని స్వామిజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతకముందు విరుష్క దంపతులు తమ కూతురు వామికాతో కలిసి బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించి.. బాబా ఆశీర్వాదాలు తీసుకున్నారు.
కోహ్లీ దంపతులు తరచుగా ఆశ్రమాలను సందర్శించడం ఆసక్తి సంతరించుకుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే.. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేస్తేనే.. భారత్ ఫైనల్ చేరనుంది.
ఇక వన్డేల్లో మంచి ఫామ్ కనబరుస్తున్న కోహ్లీ.. స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. టెస్టులో కూడా సెంచరీ చేసి తన సత్తా చాటాలని విరాట్ కూడా భావిస్తున్నాడు. స్వదేశీ పిచ్‌లు కాబట్టి కోహ్లీ చెలరేగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.