ఒక ఫోటో.. లక్షల లైక్లు - Tolivelugu

ఒక ఫోటో.. లక్షల లైక్లు

క్రికెట్ క్రేజీ ఈవెంట్. మూవీ గ్లామర్ హాట్ సబ్జెక్ట్ . ఇక రెండూ మిక్సయితే ఏమవుతుంది? విరాట్- అనుష్క రొమాన్స్ అవుతుంది. ఈ ఫేమస్ కపుల్ బీచ్‌లో విహరిస్తే సోషల్ మీడియాకు పండగయ్యింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనుష్క శర్మ జోడీ బీచ్ విహారం చేస్తున్న ఓ ఫోటో ట్వీట్ ద్వారా షేర్ చేయడంతో అది వైరల్‌గా మారి సెన్సేషన్‌ సృష్టిస్తోంది.


నెచ్చెలి ఒడిలో చెలికాడు సేద దీరే సీన్ అదిరిందని నెటిజెన్లు లైకుల మీద లైకులు కొడుతున్నారు. విరాట్ తన భార్యతో ఉన్న ఈ ఫోటో షేర్ చేస్తే ఇప్పటి వరకు 40 లక్షల మంది లైక్ కొట్టారంటే క్రేజ్ ఏమిటో అర్థం అవుతుంది.

ఇక అనుష్క శర్మ కూడా వాటర్ బేబీ క్యాప్షన్‌తో మరికొన్ని బీచ్ ఫోటోలు ట్వీట్ చేసి ఫాన్స్‌తో తన సరదా పంచుకుంది. ఇక లైకులకు కొదవేముంది. ఈ చిత్రాలకు నెటిజన్ల లైక్‌ల వాన కుంభవృష్టిగా మారింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp