గతంలో కూడా లివింగ్ లెజెండ్స్ కు సంబంధించిన ప్రశ్నా పత్రాల్లో ప్రశ్నలు అడగడం సాధారణమైన విషయమే..! మన దేశంలో సినిమా హీరోలకు, క్రికెటర్స్ కి ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకమైనదే కాదు, పాపులారిటీ పరిధికూడా ఎక్కువే.
భారత్ నుంచి గొప్ప క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకడు. అతడు ఇప్పటి వరకు దేశం తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. టీమిండియాకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు.
అలాంటి విరాట్ కోహ్లీ గురించి 9వ తరగతి పరీక్షా ప్రశ్నా పత్రంలో ఓ ప్రశ్న సంధించారు. క్రీడల పట్ల విద్యార్థుల్లో అవగాహనను,అభిరుచిని పెంచేందుకు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ ఫొటోని ఉంచి, దీనిపై 100-120 పదాల్లో డిస్క్రిప్షన్ రాయాలని కోరారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఇది పెద్ద వైరల్ గా మారింది.
కోహ్లీకి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘దీన్నే సక్సెస్ అంటారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఇమేజ్ పై నేను ఒక పుస్తకమే రాస్తాను. ఈ ఫొటో చూసి చెప్పేందుకు ఎంతో ఉంది’’ అని పేర్కొన్నాడు.
A question for the English exam of 9th Standard.
Showing the picture from the hundred of Virat Kohli against Afghanistan in the Asia Cup. pic.twitter.com/j2bhv6p1pu
— Johns. (@CricCrazyJohns) March 25, 2023