టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి రిషికేశ్ యాత్రలో ఉన్నాడు. అనుష్క శర్మ ముందు నడుస్తుండగా కూతురు వామిక కోహ్లీని భుజాన మోసుకుంటూ ఎత్తుకుని వెళ్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు విరాట్ కోహ్లీ.
కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు పూజలు, పుణ్యయాత్రలు వంటి వాటికి తాను విరుద్ధం అంటూ ప్రకటించాడు విరాట్ కోహ్లీ… అయితే పెళ్లై, కూతురు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ రూటు పూర్తిగా మారిపోయింది. నాస్తికుడిగా ప్రకటించుకున్న కోహ్లీ, ఇప్పుడు అనుష్క కారణంగా పరమ భక్తుడిగా మారిపోయాడు…మూడున్నరేళ్ల పాటు సెంచరీ చేయలేక, కెప్టెన్సీ కోల్పోయి, బీసీసీఐతో విభేదాలతో మానసికంగా ఎంతో కృంగిపోయిన విరాట్ కోహ్లీ… ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత ఫుల్లు ఎనర్జీతో కనిపిస్తున్నాడు.
ఆఫ్గాన్‌పై మొట్టమొదటి టీ20 సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ… నాలుగు మ్యాచుల గ్యాప్‌లో మూడు వన్డే సెంచరీలు బాదేశాడు…బంగ్లా టూర్‌కి ముందు నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు రిషికేశ్‌లో పూజలు నిర్వహించాడు. భార్య, కూతురితో కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్లిన విరాట్, వామిక ముఖం కనిపించకుండా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రిషికేశ్‌లో సన్యాసుల కోసం బండారా ఏర్పాటు చేసిన విరుష్క దంపతులు, వారి ఆశీసులు తీసుకున్నారు. రిషికేశ్ యాత్రను ముగించుకున్న తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా బీసీసీఐ ఏర్పాటు చేసే క్యాంపులో చేరబోతున్నాడు…