కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో ఆఖరి వన్డే ప్రారంభానికి ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జాతీయ గీతం సమయంలో చూయింగ్ గమ్ నమలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో క్లిప్‌లో, కోహ్లి తన మిగిలిన సహచరుల మాదిరిగా జాతీయ గీతాన్ని ఆలోచించకుండా చూయింగ్ గమ్ తింటూ కనిపించాడు. దీనితో నెటిజన్స్ కోహ్లీ పై రకరకాలు గా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో క్వింటన్ డి కాక్ 124 పరుగులు చేయగా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 52 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో కృష్ణ మూడు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ చెరో రెండు వికెట్లు తీశారు.ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 283 పరుగులకు ఆల్ ఔట్ అయింది.
కోహ్లీ 65 ధావన్ 61 దీపక్ చాహర్ 54 పరుగులతో రాణించగా మిగిలిన వారు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు.