టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడట. కనీసం బాక్స్ సీల్ ఓపెన్ చేయకుండానే ఫోన్ పోయిందట. ఈ విషయాన్ని విరాట్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘కనీసం కొత్త ఫోన్ ను అన్ బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్ ను చూశారా?’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఓదార్చితే.. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా స్పందించింది. తన దైన శైలిలో సరదా కామెంట్ ను విరాట్ పోస్ట్ కు జత చేసింది. ‘బాబీ ఫోన్ నుంచి ఐస్ క్రీం ఆర్డర్ చేయడానికి సంకోచించకండి’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా ప్రస్తుతం ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం కోహ్లీ రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్ పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
Nothing beats the sad feeling of losing your new phone without even unboxing it ☹️ Has anyone seen it?
— Virat Kohli (@imVkohli) February 7, 2023