రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాపటర్వం. ఆఖరి నిమిషంలో ఈ సినిమా విడుదల తేదీని ముందుకు జరిపారు. దీంతో ప్రచారానికి సమయం సరిపోలేదు. ఫలితంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాలేదు. కోటిన్నర షేర్ వస్తుందనుకున్న ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 90లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.
భారీగా బజ్ లేకపోతే తప్ప ఈ కాలం సినిమాలు చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. మేజర్, అంటే సుందరానికి లాంటి సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఫుట్ ఫాల్ పెరగలేదు. ఇప్పుడీ పరిస్థితి విరాటపర్వానికి కూడా ఎదురైంది.
విరాటపర్వం సినిమాను ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయలకు అమ్మారు. నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఆంధ్రాలో 5 కోట్ల రూపాయలకు, సీడెడ్ లో 2 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. మొదటి రోజు వసూళ్లే తక్కువగా ఉండడంతో, ఈ సినిమా బ్రేక్-ఈవెన్ పై అనుమానాలు ఎక్కువయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో విరాటపర్వం సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు చూద్దాం.
నైజాం – రూ.48 లక్షలు
సీడెడ్ – 7 లక్షలు
ఉత్తరాంధ్ర -8 లక్షలు
ఈస్ట్ – 6 లక్షలు
వెస్ట్ – 5 లక్షలు
గుంటూరు – 7 లక్షలు
నెల్లూరు – 4 లక్షలు
కృష్ణా – 5 లక్షలు