రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన విరాటపర్వం సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇది రిలీజ్ అవ్వడానికి కొన్ని రోజుల ముందు ఈ సినిమా ఓటీటీ డీల్ లాక్ అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ 6 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. సోమవారం తర్వాత సినిమా అసలు స్వరూపం బయటపడుతుంది. కమర్షియల్ గా హిట్టయితే ఓటీటీలోకి రావడానికి 7 వారాల టైమ్ పడుతుంది. కమర్షియల్ గా ఆడకపోతే మాత్రం అటుఇటుగా 4 వారాల్లోనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది
మరోవైపు సినిమా శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. కమర్షియల్ హంగులకు దూరంగా తీసిన సినిమా కావడంతో, రిలీజైన తర్వాత చూద్దాం అనే ఆలోచనతో ఛానెళ్లన్నీ వెనక్కి తగ్గాయి. ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చేయడంతో.. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా లాక్ అయ్యే అవకాశం ఉంది.
వేణు ఊడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, సురేష్ బాబు సమర్పణలో వచ్చిన విరాటపర్వం సినిమా తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవన్ అవ్వాలంటే ఈ సినిమాకు అటుఇటుగా 12 కోట్ల రూపాయలు రావాలి.