రానా-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాటపర్వం. కరోనా/లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా చాన్నాళ్లు షూటింగ్ జరుపుకుంది. మధ్యలో రానా అనారోగ్యానికి గురవ్వడంతో షూట్ ఇంకా లేట్ అయింది. దీంతో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. అయినప్పటికీ నిర్మాతలు రేట్లు పెంచలేదు. ఉన్నంతలో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను అమ్మారు.
తాజా సమాచారం ప్రకారం.. విరాటపర్వం సినిమాను ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయలకు అమ్మారు. నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఆంధ్రాలో 5 కోట్ల రూపాయలకు, సీడెడ్ లో 2 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.
నిజానికి ఈ రేట్లు అన్నీ అందుబాటులో ఉన్నవే. అయితే ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు. తెలంగాణ, ఏపీలో సాధారణ రేట్లనే ఉంచారు. కాబట్టి ఫస్ట్ వీకెండ్ కే ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు.
వేణు ఉడుగుల డైరక్ట్ చేసిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు కలిసి నిర్మించారు. సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. శాటిలైట్ రైట్స్ మాత్రం ఓపెన్ గా ఉన్నాయి.