ప్రత్యేకమైన పాత్రలతో తనకంటూ ఓన్ ఇమేజ్ సంపాదించుకన్న నటుడు దగ్గుబాటి రానా. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తున్న రానా తాజా చిత్రం విరాట పర్వం. ఈ సినిమాలో రానా ఏ క్యారెక్టర్ చేస్తున్నాడన్న ఆసక్తి ఉండగా… తన పుట్టినరోజు నాడు కామ్రెడ్ రవన్నగా నటిస్తున్నారని చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
ఏకే 47 పట్టుకుని గంభీరంగా నడుస్తున్న రానా లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ సాయిపల్లవి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా…. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, నివేద పేతురాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Presenting the first look of @RanaDaggubati from #ViraataParvam ✊
Stay tuned for the first glimpse at 11:07 AM today.#HBDRanaDaggubati@Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm @dancinemaniac #Priyamani @Naveenc212 @SureshProdns pic.twitter.com/Lh5uz0fqC5
— SLV Cinemas (@SLVCinemasOffl) December 14, 2020