ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాటపర్వం ట్రైలర్ వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాయిపల్లవి నటవిశ్వరూపం చూపించింది. ట్రైలర్ కు చేసిన ప్రమోషన్ లో సాయి పల్లవి కోసమే సినిమా తీశామని రానా చెప్పిన డైలాగ్ కు ట్రైలర్ చూడగానే నిజమనే అనిపించింది.
చిన్న ఎవడు? పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు? సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్నినాళ్లంటూ రానా చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. మూడు నిమిషాల మూడు సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తి రేపుతున్నాయి. రోమాలు నిక్కబొడిచే డైలాగ్స్‌తో విప్లవ కెరటం ఎగరేస్తోంది ఈ వీడియో.
కామ్రేడ్ రవన్నగా రానా కనిపించగా.. వెన్నెలగా సాయి పల్లవి తన నాచురల్ నటనతో అట్రాక్ట్ చేసింది. ఆలోచింపజేసే సన్నివేశాలతో పాటు ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ హైలైట్ చేసి ఈ ట్రైలర్ వదిలారు.
వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990లో జరిగిన యదార్థ సంఘటనల స్పూర్తితో రూపొందించారు. అనేక వాయిదాల అనంతరం జూన్ 17న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.