దగ్గుబాటి రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విరాట పర్వం. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రియమణి, నందితాదాస్, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఇక కథ విషయానికొస్తే నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. తెలంగాణలో 70వ దశకంలో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను తెరకెక్కించారు. నిమ్న కులానికి చెందిన ఒక అమ్మాయి కామ్రేడ్ అరణ్య అలియాస్ రవన్న రాసిన విప్లవ కవిత్వం నుంచి ప్రేరణ పొంది అతడిపై ఒకరకమైన గౌరవంతో ప్రేమను పెంచుకుంటుంది. అయితే రవన్న ను పోలీసులు పట్టుకునేందుకు గాలిస్తూ ఉంటారు. ఆ సమయంలో వెన్నెల కూడా కీలక పరిణామాల తర్వాత రవన్న ను వెతుకుతూ ఉంటుంది. చివరకు వెన్నెల కూడా ఆ దళంలో చేరుతుంది. అప్పుడు వెన్నెల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది చివరకు ఆమెకు ఏమవుతుంది అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే
సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినప్పటికీ ప్రతి ప్రేక్షకుడి ని అలాగే డిఫరెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఒక కొత్త రకమైన ఫీలింగ్ ని కలిగిస్తుంది. ఇలాంటి సినిమాలకు కంటెంట్ తో పాటు నటీనటుల ఇంపార్టెంట్. ఆ విషయంలో దర్శకుడు పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. రానా గురించి మొదటగా మాట్లాడుకున్నట్టయితే నటుడిగా రానా అందరికీ తెలుసు. కానీ ఇలాంటి పాత్ర చేయాలంటే ప్రిపేర్ అవ్వాలి. అయితే ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు రానా. చాలా అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచాడు. తన ఫిజిక్ అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక మరో పాత్ర సాయి పల్లవి… రానా తరహాలోనే సాయి పల్లవిని కూడా ఈ సినిమాలో చూడొచ్చు. ఇలాంటి పాత్రల్లో సాయిపల్లవి ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఈ సినిమా మాత్రం సాయి పల్లవికి కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ చేసే టైంలో సాయిపల్లవి నటన అద్భుతం ఒక్కమాటలో చెప్పాలంటే సాయి పల్లవి అవార్డు విన్నింగ్ ఫెర్ఫామెన్స్ అనే చెప్పాలి. అలాగే నవీన్ చంద్ర ప్రియమణి వారు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది.
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ఎంతోకొంత సృజనాత్మకతను యాడ్ చేస్తారు. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి ఆఖరి వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది కష్టమనే చెప్పాలి. అలాగే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో గా అయినట్లు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ ఇంకా బలంగా తీసుకుంటే బాగున్ను అని కూడా అనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విప్లవం నుంచి పుట్టిన ప్రేమకథగా విరాటపర్వం తెరకెక్కింది. ఎమోషన్స్ నటీనటులు నటన ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. రానా సాయి పల్లవి అయితే ఎంత చెప్పినా తక్కువే. వేణు ఊడుగుల డైరెక్షన్ కూడా బాగుంది. సెకండాఫ్ కాస్త తగ్గినా మిగతా సినిమా ఓవరాల్ గా సూపర్..