దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విరాట పర్వం. 17వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు. పదహారేళ్లకే నక్సలైట్ల చేతిలో హతమైన సరళ అనే అమ్మాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అయితే సరళ ఎవరు ? అంత చిన్నతనంలో నక్సలిజం వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ విషయాల గురించి తాజాగా ఆమె అన్నయ్య తూము మోహన్ రావు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సంఘటన 1991 జరిగిందని అన్నారు. ఖమ్మం లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ కాలేజీ కి వెళ్లి సరళ కనిపించకుండా పోవడంతో ఎక్కడికి వెళ్లిందని వెతికగా ఎక్కడా కనిపించలేదని. చివరికి తన సైకిల్ పి యు ఎస్ యు న్యూ డెమోక్రసీ ఆఫీస్ లో దొరికిందని తెలిపారు మోహన్.
ఇంటర్ లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వద్దని చెప్పినా కూడా మాట వినలేదని, అలా నెల రోజుల పాటు వెతికినా దొరకలేదని, నెల రోజుల తర్వాత ఒక పత్రికలో పోలీస్ ఇన్ ఫార్మర్ సరళ డెడ్ అనే వార్తను చూసి షాక్ అయ్యానని తెలిపారు మోహన్.
పెళ్లి హక్కుల అమ్మకం… నయనతార పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కనిపించక పోయినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానం వచ్చిందని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందోనన్న భయంతో ఇవ్వలేదని తెలిపారు. సరళ ను డాక్టర్ చేయాలని బైపిసి జాయిన్ చేసినప్పటికీ ఆమె చనిపోయే సరికి ఇంటర్ ఫస్టియర్ 10 నెలలు మాత్రమే కాలేజీకి వెళ్లిందని పరీక్షలు కూడా రాయలేదని మార్చిలో పరీక్షలు రాయాల్సి ఉండగా ఫిబ్రవరిలోనే చనిపోయిందని తెలిపారు. ఇంటర్ జాయిన్ అయినప్పటికీ కూడా తన దృష్టి ఉద్యమం వైపు ఉందని అంతేకాకుండా ఏ విషయాన్నైనా కుండ బద్దలుకొట్టి మాట్లాడలేదని తెలిపారు.
అయితే చనిపోయేవరకు అన్న దళం లో ఉన్నట్లు మాకు తెలియదని దళంలో సరళ ఉంది అంటే వేరే సరళ అని అనుకున్నామని కానీ పోలీసులు మమ్మల్ని పిలిచి కన్ఫామ్ చేసే వరకు మాకు తెలియదని తెలిపారు. చనిపోయేముందు సింహ పల్లి గ్రామానికి వెళ్లి అక్కడ దళం సభ్యులతో కలిసి పని చేయగా ఆ సమయంలో వాళ్లకు అనుమానాలు కలగడంతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదో మరి ఏమైందో తెలియదు పోలీస్ ఇన్ ఫార్మర్ అని డిసైడ్ అయ్యి కొట్టి చంపేసి, దహనం చేసి పేపర్ స్టేట్మెంట్ ను రిలీజ్ చేశారని చెప్పుకొచ్చారు మోహన్ రావు.
Advertisements
టిక్ టాక్ దుర్గారావు బ్యాక్ గ్రౌండ్ తెలుసా? అంత కష్టపడ్డాడా!