ఓ జర్నలిస్టుతో జరిగిన సంభాషణను భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఇటీవల బయటపెట్టాడు. ఆ పాత్రికేయుడి నుంచి ఎదుర్కొన్న ఇబ్బందిని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆ సమయంలో జర్నలిస్టు ప్రవర్తనతో ఆవేదన చెందినట్టు తెలిపాడు.
సాహా తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్వ్యూ కావాలని సాహాను ఓ జర్నలిస్టు అడిగారు. కానీ సదరు జర్నలిస్టు ఫోన్ ను సాహ ఎత్తలేదు. దీంతో ఆగ్రహం చెందిన జర్నలిస్టు ఇంకో సారి సాహా ఇంటర్వ్యూను తీసుకోనని తెగేసి చెప్పాడు.
‘ భారత క్రికెట్ కు ఇన్ని సేవలు అందించిన తర్వాత ఓ గౌరవ పాత్రికేయుని నుంచి నేను ఎదుర్కొన్నది ఇదే. జర్నలిజం ఎటు పోతోంది” అంటూ వారిద్దరి సంభాషణను ట్యాగ్ చేస్తే వ్యాఖ్యానించాడు.
ఈ ట్వీట్ పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ఈ విషయంలో వృద్దిమాన్ సాహాకు మద్దతుగా నిలిచారు. సదరు జర్నలిస్టు తీరుపై సెహ్వగ్ విమర్శలు చేశారు.
“చాలా విచారంగా ఉంది. ఖచ్చితంగా అతను గౌరవనీయుడు కాదు లేదా పాత్రికేయుడు కాదు. అతనిది కేవలం చంచాగిరి. మేము మీతో ఉన్నాము వృద్ధి’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.