విరూపాక్ష టీజర్ ను వెరైటీగా లాంచ్ చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడువుగా ముందుగా పవన్ కల్యాణ్ కు టీజర్ చూపించారు. పవన్ టీజర్ చూసి అద్భుతం అన్నారు. దాన్ని మీడియాకు వదిలారు. ఆ తర్వాత విరూపాక్ష టీజర్ ను లాంఛ్ చేయాలనుకున్నారు.
మొదటి భాగం బాగానే పూర్తయింది. పవన్ టీజర్ చూడడం, మెచ్చుకోవడం, ప్రెస్ కవరేజ్ అన్నీ చకచకా జరిగిపోయాయి. రెండో భాగం మాత్రం పూర్తవ్వలేదు. ఇక టీజర్ రిలీజ్ చేయడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో అనుకోని ఉపద్రవం వచ్చి పడింది.
మెగా వీరాభిమాని, హీరో సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పండు అనే వ్యక్తి హఠాత్తుగా మృత్యువాతపడ్డాడు. దీంతో అతడి మృతికి సంతాప సూచకంగా విరూపాక్ష టీజర్ లాంఛ్ ను వాయిదా వేశారు.
సాయితేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడం విశేషం.