ఎల్జి పాలిమర్స్ 1997 లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పబడింది. 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. ఈ కంపెనీ ప్రతిరోజు 417 టన్నుల పాలి స్టైరిన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని స్టైరిన్ అనబడే ముడిసరుకు ద్వారా ఉత్పత్తి చేస్తారు.ఈ కంపెనీ సౌత్ కొరియా కు చెందినది.దక్షిణ కొరియాలో స్టైరెనిక్స్ వ్యాపారంలో ప్రసిద్ధి పొందిన ఎల్‌జీ కెమికల్స్ సంస్థ భారత మార్కెట్‌లో ప్రవేశించడానికి హిందూస్థాన్ పాలిమర్స్ సంస్థ అయితే బాగుంటుందని నిర్ణయించుకుంది. అదే ఉద్దేశంతో 1997, జులైలో హిందూస్థాన్ పాలిమర్స్‌లో వంద శాతం వాటాను కొనుక్కొని ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా పేరు మార్చింది.ఈ కంపెనీ డైరెక్టర్ల లిస్ట్ ఒక్కసారి కింది ఫోటో లో చూడొచ్చు.
ప్రస్తుతం లీక్ అయింది కూడా ఈ స్టైరిన్ విష వాయువే.ఇది అత్యంత ప్రమాదకరమైన వాయువు. భోపాల్ గ్యాస్ ఘటనకు, ఇప్పుడు జరిగిన దానికి పోలిక మానవ తప్పిదం.
ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఎల్జి పాలిమర్స్ కంపెనీ నడుస్తోంది.ఇక్కడి వైసీపీ ప్రభుత్వానికి, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి లాలూచీ వ్యవహారాలు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.లేకుంటే లాక్ డౌన్ సమయంలో ఈ కంపెనీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముందని, అత్యవసర విభాగం కూడా కాదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అసలు ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గతంలో కూడా ఒకసారి ఈ సంస్థలో గ్యాస్ లీకైనట్టు సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించకుండా, జనావాసాల మధ్యలో ఈ కంపెనీ నడుస్తుందని తెలుస్తోంది.2019 లో కంపెనీ విస్తరణ ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ కంపెనీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్యాస్ లీకైన వెంటనే జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని తెలుస్తోంది.