విశాఖ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఎయిర్ పోర్టు డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సర్వీసులు రద్దు కాలేదని యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే మేఘాద్రి గెడ్డ గేట్లు ఎత్తివేయడంతో విమానాశ్రయం వైపు వరదనీరు చేరుతోంది. కానీ.. ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షిస్తున్నట్లు తెలిపారు శ్రీనివాస్.
గులాబ్ తుపాను ప్రభావంతో సోమవారం వరకు విశాఖ ఎయిర్ పోర్టును వరదనీరు ముంచెత్తింది. ఎటుచూసినా నీళ్లే కనిపించాయి. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకానొక సందర్భంలో విమానాలు గాల్లో చాలాసేపు చక్కర్లు కొట్టిన పరిస్థితి. అయితే మంగళవారానికి అంతా మంచిగా ఉందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ ప్రకటించారు. చుక్క నీరు కూడా లేని ఎయిర్ పోర్టు ఫోటోలను ట్వీట్ చేశారు.