విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన కలచి వేసిందన్న సీఎం జగన్, ఘటనపై విచారణ చేయడానికి అధికారులతో కూడిన కమిటీ వేశారు. ప్రముఖ కంపెనీలో ఇలాంటి ఘటన బాధకరమని, దీనిపై లోతైన ఆధ్యయనం జరగాలన్నారు. అధికారులు సకాలంలో స్పందించటం వల్ల నష్ట నివారణ చేయగలిగామన్నారు.
ఇక విశాఖ ఘటనలో మృతి చెందిన వారికి కోటి రూపాయల నష్ట పరిహరం సీఎం జగన్ ప్రకటించారు. ఇందులో కంపెనీ నుండి నష్ట పరిహరం విషయం ప్రభుత్వం చూసుకుంటుందని, వెంటిలేటర్ పై ఉన్న వారికి 25లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సహయం ప్రకటించారు.
ఇక ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టడంతో పాటు అవసరమైతే షెల్టర్ ఏర్పాటు చేయటం, మంచి భోజనం ఏర్పాటు చేయాలన్నారు. బాధిత 5 గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 10వేల రూపాయలు పరిహరం ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సీఎస్ తో పాటు పలువురు మంత్రులు విశాఖలోనే ఉండి ఎలాంటి అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకుంటారని సీఎం జగన్ ఆదేశించారు.