విశాఖపట్నం : జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటులో నిర్లక్ష్యానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ ఇద్దరు కోచ్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. క్రీడా దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా క్రీడాకారుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను పెట్టారు. ఒక ఫ్లెక్సీలో సానియామీర్జా ఫోటో వేసి ఆమెని పీటీ ఉషగా పేర్కొన్నారు. దీనిపై తొలివెలుగు ఫ్లెక్లీ ఫోటో సహా అందరి దృష్టికి తీసుకువచ్చింది. మొత్తం 20 మంది వివిధ క్రీడాకారుల ఫోటోలను ఫ్లెక్సీలలో పెట్టారు. మిగిలిన ఫ్లెక్సీల్లో ఏ పొరబాట్లు ఉన్నాయో ఏమో కానీ.. ఇప్పుడు జరిగిన పొరబాటుకు మాత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ సంబంధిత అధికారులతో విచారణ చేయించి ఇద్దరు కోచ్‌లను బాధ్యులుగా గుర్తించి షోకాజ్నోటీసులు జారీచేశారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » తప్పుడు ఫ్లెక్సీకి దండన.. తొలివెలుగు వార్తకు స్పందన