తమిళ స్టార్ హీరో విశాల్ తండ్రి ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఆయన కొద్ది రోజుల్లోనే కరోనా ను జయించారు.అయితే 82 ఏళ్ల జీకే రెడ్డి విశాల్ తో సమానంగా ఫిట్ గా ఉంటారు. దానికి సంబంధించిన సీక్రెట్ ను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాధి అధికంగా ఉండడం వల్ల బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
అందువల్ల ఇంట్లోనే ఉండి బాడీ పెంపొందించుకోవచ్చు అని ఆయన అన్నారు. తేలికపాటి వ్యాయామాలు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని, క్రమం తప్పకుండా చేస్తే ఏ వయసులో అయినా ఉండొచ్చని రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా మారింది.