తమిళ స్టార్ హీరో విశాల్ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. విశాల్ కు తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే హిట్ లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు విశాల్.
కాగా ఆనంద శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా ఆర్య విలన్ గా నటించనున్నారు.ఇక ఈ చిత్రానికి ఎనిమీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విశాల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాటోవైపు ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.