తమిళ్ స్టార్ హీరో విశాల్ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. షూటింగ్ సమయంలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు అయినా విశాల్ కాంప్రమైజ్ అవ్వడు. దీంతో చాలాసార్లు అతను షూటింగ్ సమయంలో గాయపడ్డాడు.
తాజాగా ఆయన చేస్తున్న లాఠీ సినిమా షూటింగులో ప్రమాదానికి గురయ్యారు విశాల్. ఇదే విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విశాల్ నటిస్తున్న ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
వినోద్ కు ఇది మొదటి చిత్రం. ఇందులో సునయన హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఆ సమయంలోనే విశాల్ చేతికి గాయం కావడంతో చికిత్స కోసం కేరళ వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.