ఉప్పెన సినిమాతో సంచలన విజయం సాధించి… ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా చేసిన ఈ మెగా కాంపౌండ్ హీరో… బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా మూడో సినిమా మొదలుపెట్టాడు.
ఈ సినిమాకు గిరీశయ్య దర్శకత్వం వహించనున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో తెరకెక్కించిన ఈ దర్శకుడు ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా చేయబోతున్నాడు.
శుక్రవారం సాయి ధరమ్ తేజ్ తో కలిసి లాంఛనంగా మూవీ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటించనున్నారు.