వరుస వలసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా బలపడుతోందనేందుకు సూచికలా? ఒక్కొక్కరూ బీజేపీ బాట పడుతుండటం కాషాయ దళానికి కొత్త బూస్ట్ ఇస్తోంది. లిస్టులో లేటెస్టుగా మరో పేరు.. విష్ణువర్ధన్‌రెడ్డి! PJR వారసుడు..
హైదరాబాద్ : జీవించి వుంటే పీజేఆర్ కచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అయ్యివుండేవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ సమీకరణలు కూడా వేరుగా వుండేవి. ఇది అందరూ అనుకునే మాటే. పీజేఆర్‌కు హైదరాబాద్‌లో వుండే పట్టు అలాంటిది. ఇప్పుడు కాంగ్రెస్‌లో రేవంత్ ఎలా డైనమిక్ లీడరుగా క్రేజ్ సంపాదించుకుంటున్నాడో.. అప్పట్లో అంతకు ఎన్నో రెట్లు పీజేఆర్ పేరు సంపాదించేశాడు. కాంగ్రెస్ రాజకీయాల్లో అప్పుడు ఒకే ఒక్కడు పీజేఆర్! అలాంటి పీజేఆర్ వారసుడిగా వచ్చి ఆరంభంలో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన విష్ణువర్ధన్‌రెడ్డి తర్వాత అడుగులు తడబడి ఎక్కడో ఉండాల్సినోడు ఇంకెక్కడో వున్నాడని పీజేఆర్ ఫాన్స్ అనుకుంటూ వుంటారు. ఇలావుంటే, ఇప్పుడు ఈ పీజేఆర్ వారసుడు బీజేపీ తీర్థం తీసుకుంటున్నాడా?