అప్పుడెప్పుడో తమిళ్ సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన సుచిలీక్స్ తరవాత అంత హడావిడి నిన్న ట్విట్టర్ లో కనిపించింది. అయితే ఇది ఒక హీరో కో, గ్లామర్ ఇండస్ట్రీ కో సంబంధించింది కాదు. ఒక పద్దతి, విలువలు, వ్యక్తిత్వం అంటూ మాట్లాడే ఒక నేత నిజరూప దర్శనం చేయించిన ట్విట్టర్ భాగోతమిది.
అసలు ఈ విష్ణులీక్స్ వివరాల్లోకి వెళితే….ఈనాటి నిఖార్సయిన ఆంధ్ర బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి, పదేళ్ల క్రితం చేసిన ట్వీట్స్, వాటిలో పైత్యం గురించే ఈ చర్చ అంతా! ఎందుకో, ఏమిటో తెలియదు జనసైనికులు ట్విట్టర్లో తవ్వకాలు మొదలు పెట్టారు. మామూలు తవ్వకాలు కాదు, బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అంతరంగాలని పరిచయం చేసే ట్వీట్ తవ్వకాలు….ఏకంగా పదేళ్ల క్రితందాకా వెళ్లి తవ్వకాలు చేసారు.
ఆ తవ్వకాల్లో , విష్ణు వర్ధన్ రెడ్డికి వున్న కుల పిచ్చి, మతపిచ్చి తో పాటు ఆడవాళ్ళ పట్ల అతని ఆలోచనలు బయటపడ్డాయి. ఇక ఆ ట్వీట్లలో వాడిన భాషాపాండిత్యం చూసి జనం షాక్ లో ఉన్నారు.
ఈ ట్వీట్లు బయటపడడం మొదలయ్యాక విష్ణు వర్ధన్ రెడ్డి హడావిడిగా డిలీట్ చెయ్యడం మొదలు పెట్టారు. అయితే, ఒకటి రెండు ట్వీట్లు అయితే ఎదో తీసేసి, జనంకి సమాధానం చెప్పుకోవచ్చు. జన సైనికులు పురావస్తుశాఖ అధికారుల్లా తవ్వి తీస్తుంటే కొన్ని వేల ట్వీట్లు బయటపడడం మొదలయ్యాయి.
వాటి మీద ట్విట్టర్లో దుమారమే రేగింది… ఎన్నో సెటైర్లు కూడా పేలడం మొదలయ్యాయి.. సమాధానం చెప్పుకోలేక విష్ణు వర్ధన్ రెడ్డి మొత్తానికి ట్విట్టర్ అకౌంట్ మూసెయ్యాల్సివచ్చింది. ‘బీజేపీలో ఉన్నా జగన్ అంటే ప్రేమకు కులపిచ్చి కారణమా’, ‘స్వీట్లు కూడా రెడ్డి పేరు లేకపోతే స్వీట్ గా ఉండవు’ – తెగ చమక్కులు పేలాయి. ఇక హీరోయిన్లను వర్ణిస్తూ చేసిన ట్వీట్లు మరీ హాట్ డిస్కషన్ అయిపోయాయి.
ఆఖరికి ఇది నేను ఎవరిదగ్గరో తీసుకున్న థర్డ్ పార్టీ అకౌంట్, ఆ పాత ట్వీట్లకు నాకు సంబంధం లేదు అని చెప్పినా కూడా ఈ దుమారం ఆగలేదు. లేటెస్ట్ గా తొలివెలుగు కి అందుతున్న సమాచారం ప్రకారం… ఎవరో సంతోష్ అనే వ్యక్తి తో తప్పంతా తనదే అని విష్ణు వర్ధన్ కు అస్సలు సంబంధం లేదని…తాను విష్ణు వర్ధన్ ఫ్యాన్ కాబట్టి ఆ అకౌంట్ తానే నడిపానని…ఆ పాత ట్వీట్ల పైత్యం అంతా తనదే అని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి మరీ చెప్పించే పనిలో ఉన్నారంట.
చేసిన కర్మేకాదు, ట్వీట్లు కూడా జాగ్రత్తగా ఉండకపోతే…మనల్ని వెతుకుంటూ వచ్చి కాటేస్తాయని అనడానికి ఇదే మంచి ఉదాహరణ.