కోలివుడ్ స్టార్ విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గుత్తా జ్వాలకు విష్ణు విడాకులు ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. విష్ణు చేసిన ట్వీట్‌ను చూస్తే ఆ విషయం అర్థమవుతోందంటూ దానికి వివరణలు కూడా ఇస్తున్నారు.
ఇంతకు ఆ ట్వీట్ లో ఏముందంటే… రెండు రోజుల క్రితం హీరో విష్ణు ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. దానిలో ఒక కోట్ ను షేర్ చేశాడు. తాను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతూనే వస్తున్నానని పేర్కొన్నారు. కానీ తాను మాత్రం ఓడిపోలేదని వెల్లడించారు.
దాని నుంచి ఓ కొత్త గుణపాఠాన్ని కూడా నేర్చుకున్నానని చెప్పారు. ఇది తనకు పరాజయం కాదన్నారు. పూర్తిగా తన తప్పేనని, అదొక మోసంతో కూడిన ద్రోహమంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో నెటిజన్లు విష్ణు గురించి ఏదో ఊహించుకున్నారు.
విష్ణు, గుత్తా జ్వాలకు మధ్య ఏదో గొడవ జరిగిందని, త్వరలోనే ఆ జంట విడిపోవాలనుకుంటోందని, అందుకే విష్ణు అలాంటి పోస్టు పెట్టారంటూ లేని పోనివి ఊహించికుని పుకార్లు రేపారు. ఆ కొద్ది సేపటికే పుకార్లు వరల్ అయ్యాయి. దీంతో విష్ణు క్లారిటీ ఇస్తూ మరో పోస్టు పెట్టారు.
తన ట్వీట్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. ఆ పోస్టు కేవలం తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి రాసిందని, వ్యక్తిగత జీవితం గురించి కాదని స్పష్టం చేశారు. తమ ఇద్దరికి ఒకరిపై మరొకరికి నమ్మకం ఎక్కువ అని చెప్పారు. మనం ఎదుటివారికి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ నమ్మకం మాత్రమేనన్నారు.
ఒకవేళ ఆ నమ్మకాన్ని కల్పించడంలో మనం విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటామని వెల్లడించారు. మన పట్ల మనం అంత కఠినంగా ఉండకూడదని తాను చెప్పానని వివరణ ఇచ్చారు. దీంతో వారి విడాకులపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.