కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇటీవల రానా నటించిన అరణ్యలో కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం విష్ణు విశాల్ ఎఫ్‌ఐఆర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు మను ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా… స్వయంగా విష్ణు విశాల్ నిర్మించారు. కాగా ఇప్పుడు తెలుగులో ఈ చిత్రానికి గట్టి మద్దతు లభిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. కాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫిబ్రవరి 11న తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ పోస్టర్‌లో విష్ణు విశాల్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు.మరి చూడాలి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.