విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఉండవల్లి.. ఊసరవెల్లి లకు ఎప్పుడు ఏం గుర్తుకు వస్తాయో తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ జెండా పీకేస్తుంది. వేలకోట్లు సంపాదించి పాదయాత్రలు చేస్తారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే దమ్ము బీజేపీకి మాత్రమే ఉంది. బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేయడం దారుణం. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధితో ఎన్నికలకు వెళుతుంది. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతానని ఎక్కడా చెప్పలేదు. వైసీపీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు సీబీఐ వద్దన్నారు. ప్రతిపక్షంలో ఉండగా సీబీఐని రమ్మంటున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల నుండి రాలేదు. బీజేపీ, జనసేనను విడగొట్టాలని కుట్ర పన్నుతున్నారు. మా రెండు పార్టీల బంధం మరింత బలపడింది. చేతకాని అసమర్ధ పాలనతో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. చంద్రబాబు స్వార్ధపూరిత నిర్ణయం వల్లే అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. జగన్ మూడు రాజధానుల డ్రామాకు కారణం చంద్రబాబు నాయుడే.
800 కోట్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ అద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. చంద్రబాబు కనీసం శాశ్వత శాసనసభ అయినా కట్టారా? జగన్ ఈ మూడున్నర ఏళ్ళల్లో కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు అయినా కట్టారా? దోపిడీలో తేడా వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై 10 వేల ప్రజా ఛార్జ్ షీట్ లను వేయనున్నాం. లక్ష హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారు.