టాలీవుడ్ బిజీ ఆర్టిస్టుల్లో ఒకడిగా మారాడు విశ్వక్ సేన్. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా వచ్చిన పాగల్ అనే సినిమా డిజాస్టర్ అవ్వడంతో, విశ్వక్ సేన్ కు అవకాశాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ విశ్వక్ జోరు మాత్రం తగ్గలేదు. తాజాగా అతడు తన సినిమాల లిస్ట్ బయటపెట్టాడు.
ప్రస్తుతం ఈ హీరో అశోకవనంలో అర్జున కల్యాణం అనే సినిమా చేస్తున్నాడు. ఇది విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు ఓరి దేవుడా అనే రీమేక్ సినిమా కూడా రెడీ అయింది. ఈ రెండు కాకుండా తాజాగా దాస్ కా దమ్కీ అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు స్వయంగా అతడే దర్శకుడు కూడా.
ఈ సినిమాలతో పాటు స్టూడెంట్ జిందాబాద్ అనే కొత్త సినిమా ప్రకటించాడు విశ్వక్. అటు తన సూపర్ హిట్ మూవీ ఫలక్ నుమా దాస్ కు సీక్వెల్ కూడా ఎనౌన్స్ చేశాడు. ఇవి కాకుండా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గామి అనే సినిమా చేస్తున్నాడు. అటు ముఖచిత్రం అనే సినిమాలో కీలకమైన లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇలా చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం అతడి వయసు 27 ఏళ్లు. మరో మూడేళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానంటున్నాడు.