యంగ్ టైగర్ ఎన్టీఆర్… టాలీవుడ్ లో డైలాగ్ చెప్పాలన్నా, డాన్స్ చెయ్యాలన్నా ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. టెంపర్, జనతాగ్యారేజ్, అరవింద సమేత వంటి సూపర్ డూపర్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే మే 20న యంగ్ టైగర్ పుట్టిన రోజు. మాములుగా తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వస్తే అభిమానులు ఎలా జరుపుకుంటారో పెద్దగా చెప్పనవసరం లేదు.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని లేఖను విడుదల చేశాడు ఎన్టీఆర్.
అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దమైయ్యాడు హీరో విశ్వక్ సేన్ . మాస్ కా బాప్ పేరుతో తాను నటించిన ‘ఫలక్ నామా దాస్’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నాడు. మే 20న ఉదయం 11 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను విడుదల చేశాడు.