నేపాల్ తో భారత సంబంధాలు అసమానమైనవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పొరుగు దేశం నేపాల్ లో ఆయన సోమవారం పర్యటించనున్నారు. పర్యటనకు ఒక్క రోజు ముందు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గత నెలలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా భారత్ లో పర్యటించినప్పుడు ఆయనతో తాను జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మోడీ అన్నారు. ఈ క్రమంలో ఆయన్ని మరోసారి కలవాలని తాను అనుకుంటున్నట్టు పేర్కొన్నారు.
జలవిద్యుత్, కనెక్టివిటీ, అభివృద్ధితో సహా పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరుపక్షాలు భాగస్వామ్య అవగాహనను కొనసాగించాలని ఆయన వెల్లడించారు.
నేపాల్‌తో మన సంబంధాలు అసమానమైనవి. శతాబ్దాల తరబడి పెంపొందించిన ఈ కాలానుగుణ సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడానికి తన పర్యటన తోడ్పడుతుందన్నారు.