శభాష్ ప్రభాస్
యంగ్ రెబల్ డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీ విశేషాలు తెలుసుకున్న కొద్దీ ఆసక్తి రేపుతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ పూటకో మేటర్ మోసుకొస్తూ సర్కులేట్ చేసుకుని సంబర పడుతున్నారు. వ్యయాన్ని లెక్క చేయకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బహుబలి రికార్డుల్ని తిరగరాస్తుందని అంటున్నారు. ఒక విజువల్ ఫీస్ట్‌గా చెబుతున్న ఈ మూవీ ప్రస్తుతం ఇండియావైడ్ వెరీ ఇంట్రస్టింగ్ టాపిక్.
దిలీప్ చాపరీ నేతృత్వంలో ఈ చిత్రం కోసం రూపొందించిన భారీ ట్రక్ సూపర్ న్యూ మోడల్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ముప్పయ్ మంది వర్కర్లు పదిహేను రోజులు శ్రమించి దీన్ని తయారు చేశారట. దీన్ని భారీ యాక్షన్ సీన్‌లో భాగంగా బ్లాస్టింగ్ చేశారట. దీంతోపాటు మరో రెండు కార్లు తయారు చేశారట. ఇక ప్రీ క్లయిమ్యాక్స్ యాక్షన్ సూపర్ అంటున్నారు. 12 నిమిషాల పాటు ప్రీ క్లయిమ్యాక్స్ సీన్స్ తీయడానికి 75 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎంత భారీగా ఉంటుందో మరి..! హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కిన్నీ బేట్స్ దీన్ని ఆసక్తికరంగా రూపొందించారట.
చైనా ఫైట్ మాస్టర్ పెన్‌ఝాంగ్ ఆధ్వర్యంలో తీసిన హీరో ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందట. చిత్రంలో రాంలక్ష్మణ్, దిలీప్ సుబ్బరామన్, సిల్వా తీసిన ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్..! ఆస్ట్రియా, అబుదాబి, ఇటలీ, ఇండియా లోకేషన్లలో వందల సెట్లు వేసి వండర్ మూవీ రూపొందించారు. రిలీజయ్యాక అన్నీ మాట్లాడతానంటున్న డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు ఎంతో కూల్‌గా, మరెంతో కాన్ఫిడెన్టుగా ఉన్నాడు.