విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ పాగల్. నరేశ్ కుప్పిలి దర్వకత్వం వహిస్తుండగా.. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను.. ఈనెల 14న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది చిత్రబృందం. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిట్ సినిమా తరువాత విశ్వక్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ కూడా నటించారు.