ఫలక్ నూమ దాస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక హిట్ సినిమాతో హిట్ కొట్టి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా పాగల్ టీజర్ విడుదల తేదీని తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంను ఏప్రిల్ 30న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.