బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తుదిఘట్టానికి చేరుకుంది. 90 రోజులు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు రోజుకో మలుపులు తిరుగుతున్నాయి.ప్రస్తుతం హౌస్ లో 7 మంది సభ్యులు ఉన్నారు. 13 వ వారం నామినేషన్ లో భాగంగా ఇంట్లో ఉన్న 7 మంది కూడా నామినేట్ అయ్యారు. దీనితో ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు అన్నదానిమీద ఆశక్తి నెలకొంది. అయితే సోషల్ మీడియా లో మాత్రం వరుణ్ భార్య వితికా బయటకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ నిజంగా వితికా బయటకు వెళ్తే వరుణ్ సందేశ్ ఇక మీద ఎలా ఆడుతాడు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. వితికా నామినేషన్ కి ప్రధాన కారణం శివజ్యోతితో గొడవలు, అటు రాహుల్ తో కూడా మునుపటిలా సఖ్యత లేకపోవటమే అంటున్నారు నెటిజన్లు. అస్సలు నిజంగా వితిక బయటకు వస్తుందా, లేఖ ఇంకెవరైనా వస్తారా అనేది మాత్రం తెలియదు. దీనిగురించి గుర్థించి ఒక క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.