కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఆయనకు వై కేటగిరి భద్రత కింద 7 నుంచి 8 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రతా కల్పిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నిర్ణయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కశ్మీరి ఫైల్స్ చిత్రం విడుదలైన తర్వాత ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కశ్మీర్ ఫైల్స్ మార్చి 11న విడుదలైంది. కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడులు, వలసలు ఇతివృత్తంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అద్భుతంగా తెరెకెక్కించారు. సినిమా విడుదలైనప్పట్టి నుంచి వివాదంలో చిక్కుకుంది.
బీజేపీ పార్లమెంటరీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కాశ్మీరి ఫైల్స్ అనే సినిమాకు తన మద్దతు ఉంటుందని ప్రధాని మోడీ సమావేశంలో పేర్కొన్నారు.