వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
రాష్ట్ర ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ మర్చిపోయారు. దళిత ముఖ్యమంత్రి.. మూడెకరాలు ఇలా చాలా హామీల్లో మోసం చేశారు. ఎన్నికలొస్తే హామీలు ఇవ్వడం.. తర్వాత మర్చిపోవడం.. అబద్దాలు చెప్పడం కేసీఆర్ కు అలవాటైంది.
ప్రధాని మోడీకి కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే. మోడీ శవయాత్రలకు కేసీఆర్ ఫ్రస్ట్రేషనే కారణం. సింగరేణి ప్రైవేటీకరణ, మోటార్లకు మీటర్లపై కేసీఆర్ అవాస్తవాలను ఖండిస్తున్నాం.
నిజాం ఘగర్ ప్యాక్టరీని రీఓపెన్ చేస్తానని కేసీఆర్ మాట తప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు సీఎం ఊడిగం చేస్తున్నారు.
కేసీఆర్ తీరుతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీ, అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారు.