మంత్రి కేటీఆర్‌కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోల్ మైన్ బ్లాక్స్ విషయంలో అవగాహన లేకుండా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసం ఆశపడి తాడిచర్ల మైన్స్ ను ఏఎమ్ఆర్ కు కేసీఆర్ ప్రభుత్వం అప్పగించిందన్నారు.
ఈ మైన్‌లో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. తాడిచర్ల మైన్స్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారమే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు టెండర్స్‌ను దక్కించుకున్నారని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఉప ఎన్నికలను ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని ఆయన తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.