పదుల సంఖ్యలో జనం మరణాలకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ కు ఊహించని షాక్ తగిలింది .నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై సుప్రీమ్ కోర్ట్ కు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ చెంప చెళ్లుమనిపించింది ఉన్నత న్యాయస్థానం. ఎన్జీటీలో విచారణ తరువాతే సుప్రీం కోర్టులో విచారణ ఉంటుందని ధర్మాసనం తెలిపింది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.విచారణ జూన్ 8కి వాయిదా వేసింది కోర్ట్ .
ఈకేసును సుమోటోగా విచారణ చేపట్టే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేదని ఎల్జీ పాలిమర్స్ వాదనలు వినిపించగా.. ఆ విషయాలన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట ప్రస్తావించాలని ధర్మాసనం తెలిపింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేసింది.
ఘటన జరిగిన వెంటనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎల్జీ పాలిమర్స్ పై చాలా సీరియస్ అయింది . నోటీసులు ఇవ్వడంతో పాటు విషవాయువు లీకేజీ ఘటనలో రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్ సుప్రీమ్ కోర్ట్ కు వెళ్ళింది.