శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి( 24) దాదాపు యాడాదిన్నరగా కనిపించడంలేదు.ఎటువంటి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా ధనలక్ష్మి కేసు నమోదు చేసారు పక్కనబెట్టారు.అయితే విశాఖపట్నంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో డ్రమ్ములో పడి ఉన్న ఓ శవం తీవ్ర సంచలం స్రుష్టించింది.
ముక్కలు ముక్కలుగా, ముద్దలు ముద్దలుగా పాలథీన్ బ్యాగ్స్ లో మూటలు కట్టపడి ఉన్న ఆ మ్రుత దేహం ఎవరిది ? ఈ ఘాతుకానికి ఎవరు వడిగట్టారని విచారించగా విస్తుపోయే వాస్తవాలు పోలీసులకు తెలియవచ్చాయి. దీంతో మిస్సయిన ధనలక్ష్మికి కేసుకి, మ్రుతదేహానికి సంబంధం ఉందని ప్రాధమిక విచారణలో తేలడంతో యాడాదిన్నర మిస్సింగ్ మిస్టరికీ తెరపడినట్లైంది.
పోలీసుల సమాచారం ప్రకారం. ప్రస్తుతం మధుర వాడలో ఈ ఇంటింని అద్దెకు తీసుకున్న ఈ వ్యక్తి సంవత్సరంన్నరగా అద్దెకట్టకుండా యజమాని కన్నుగప్పి తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఏదో సాకు చెబుతూ సంవత్సరంనర నెట్టుకువచ్చాడు. అయితే పత్తాలేకుండ ఉన్న సదరు వ్యక్తిపై ఆగ్రహం చెందిన యజమాని గది తాళాలు బద్దలు కొట్టి చూడగా భయభ్రాంతులు కలిగించే ద్రుశ్యం కంటపడింది. డ్రమ్ములో కుళ్ళిపోయి, ముక్కలు ముక్కలుగా ఉన్నశవం కనిపించడంతో కాలనీఅంతా సంచలనంగా మారింది.
పోలీసువర్గాలకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చెరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.ఆ ఇంట్లో ఉంటూ యజమానికి కనిపించకుండా తిరుగతున్న పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతం పేటకు చెందిన రుషిని అదుపులోనికి తీసుకున్నారు.
విచారించగా కీలక విషయాలు తెలిసాయి. ఇంట్లో లభించిన మ్రుత దేహం యొక్క రహస్యాన్ని దాచి నిందితుడికి సహకరించిన వ్యక్తులెవరు ? ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చిందనే విషయాలను రాబట్టారు. ప్లాస్టిక్ సంచుల్లో ముద్దలుగా మారి కుళ్ళిన స్థితిలో ఉన్న శరీర భాగాలకు శవపరీక్షలు నిమిత్తం కేజీహెచ్ కి తరలించి తద్వారా వచ్చిన నివేదికను విశ్లేశిస్తున్నారు.
విచారణలో పోలీసులకు తెలిసిన విషయం ఏంటంటే గతంలో రుషిభార్య పుట్టింటికి వెళ్ళింది.ఈ తరుణంలోనిందితుడు రుషికి ఆమె స్థానిక బస్ స్టేషన్లో పరిచయం అయ్యింది.ఇంటికి తీసుకెళ్ళిన నిందితుడు ఆమెతో జరిగిన వాగ్వాదంలో హత్యచేసాడని అనంతరం మ్రుత దేహాన్ని ముక్కలు చేసి మూటలు కట్టి డ్రమ్ములో కుక్కి అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసుల విచారణలో రాబట్టిన విషయాలు.
హత్య జరిగిన నివాసంలో క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. పోలీసులు అయిదు బ్రుందాలుగా విడిపోయి విశాఖపట్నం,విజయ నగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్ళి నిందితుణ్ణి అదుపులోనికి తీసుకోవడంతో పాటు అతడికి సంబంధించిన పలు వివరాలు రాబ్టటారు.అతని కాల్ డేటా పరిశీలించారు.
పార్వతీపురం మన్యంలో ప్రస్తుతం రుషి ఉంటున్న ఇంటి వివరాలు కూడా రాబట్టారు. అయితే మ్రుత దేహం లభించిన ఇంటి యజమాని ఇచ్చిన వివరాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు.
మ్రుత దేహం పూర్తిగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. ఆమె ఎవరన్నదీ గుర్తించడానికి పోలీసులు సైతం ఇబ్బంది పడ్డారు. తలభాగం మొత్తం కుళ్ళిపోయి పుర్రెమాత్రమే మిగిలింది. మ్రుత దేహం ఆ స్థాయిలో కుళ్ళిపోయినా ఇరుగుపొరుగు ఇళ్ళకు కనీసం వాసన రాకుండా నిందుతుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడన్న అంశం పోలీసులు చర్చిస్తున్నారు.
హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో గత కొంత కాలంగా వ్యభిచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఆకోణంలో ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా ఇంత కాలం మ్రుత దేహానికి సమీపంలో ఉన్నామా అని విశాఖ వికలాంగుల కాలనీ వాసులు తీవ్రఆందోళనకు చెందుతున్నారు.